TG: బసవేశ్వరుడి జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద ఆయన విగ్రహానికి జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పూలమాల వేసి నివాళులర్పించారు. సమానత్వం, ప్రజాస్వామిక విలువలకు బసవేశ్వరుడు నాంది పలికారని పేర్కొన్నారు. కుల, వర్ణ, లింగ భేదాలు లేకుండా సమాన అవకాశాల కోసం ఇంకా పోరాటం కొనసాగుతుందన్నారు. మహిళలకు 33% అవకాశాలు కల్పించే లక్ష్యంతో సామాజిక న్యాయం కోసం పని చేస్తామని వెల్లడించారు.