TG: వరంగల్ జిల్లా కోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు రావడంతో కలకలం రేగింది. ఈరోజు మధ్యాహ్నం కోర్టును బాంబుతో పేల్చివేస్తామని ఓ అపరిచిత వ్యక్తి నుంచి పోలీసులకు ఈమెయిల్ అందింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బాంబు స్క్వాడ్‌తో కోర్టు ప్రాంగణంలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. నెల రోజుల వ్యవధిలోనే కోర్టుకు ఇలాంటి బెదిరింపులు రావడం ఇది మూడోసారి కావడం గమనార్హం.