TG: తెలంగాణ ERCకి మాజీమంత్రి హరీష్ రావు లేఖ రాశారు. రైతు డిస్కం డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ కోసం ప్రభుత్వం చేసిన దరఖాస్తును తిరస్కరించాలని కోరారు. రైతులను, విద్యుత్‌ను విడదీసి చూడలేమన్నారు. రైతులపై విద్యుత్తు ఛార్జీల భారం కారణంగా గతంలో KCR ఉద్యమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. రైతు డిస్కం పేరుతో మూడో డిస్కం ఏర్పాటు చేస్తారని ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయన్నారు.