తెలుగు రాష్ట్రాల్లో టమోటా ధరలు పడిపోయాయి. ఉమ్మడి వరంగల్లో 25 KGల పెట్టె NOVలో రూ.900 ఉండగా ప్రస్తుతం రూ.60-80 మాత్రమే పలుకుతోంది. అంటే కిలోకు రూ.2-3 మాత్రమే. రవాణా ఖర్చులు కూడా మిగలట్లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. కొందరు ఫ్రీగా పంచిపెడుతుంటే మరికొందరు చేనులోనే వదిలేస్తున్నారు. ఏపీలోని మదనపల్లెలోనూ ఇదే పరిస్థితి. బహిరంగ మార్కెట్లో కేజీ రూ.5-10 వరకు అమ్ముతున్నారు.