TG: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ తన వినియోగదారులకు మరింత సులభమైన సేవలు అందించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. ఈ దిశగా వినియోగదారులు విద్యుత్ సేవలను నేరుగా తమ మొబైల్ ఫోన్ ద్వారానే పొందేలా వాట్సాప్ చాట్‌బాట్ సేవలను ప్రారంభించింది. విద్యుత్ వినియోగదారులు తమ వాట్సాప్‌లో 8712441912 నంబర్‌కు Hi అని మెసేజ్ చేస్తే వివిధ సేవలను పొందవచ్చు.