NZB: జానకంపేట్-నిజామాబాద్ రైల్వే స్టేషన్ మధ్య అర్సపల్లి రైల్వే గేట్ వద్ద డెమో రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు NZB రైల్వే పోలీసులు ఆదివారం తెలిపారు. నాందేడ్-నిజామాబాద్ DEMU రాకను గమనించకుండా రైలు పట్టాలు దాటడానికి ప్రయత్నించగా.. ఈ ప్రమాదం జరిగి అతను అక్కడికక్కడే మృతి చెందాడని చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు వారు వెల్లడించారు.