సూర్యాపేట: సైబర్ మోసగాళ్ల మాయమాటలు నమ్మి మోసపోవద్దని జిల్లా ఎస్పీ నరసింహ ఇవాళ ప్రజలను హెచ్చరించారు. స్టాక్ మార్కెట్, ఏపీకే ఫైల్స్ వంటి నూతన పద్ధతుల్లో జరిగే నేరాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఒకవేళ మోసపోతే వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. అవగాహనతోనే సైబర్ నేరాలను అడ్డుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.