AP: YCP MLC అనంతబాబుకు కోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. సాక్షులను బెదిరించిన కేసులో రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలన్న అనంతబాబు పిటిషన్ను ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. హత్య కేసు విచారణ కీలక దశలో ఉన్నందున బెయిల్ ఇవ్వవద్దని PP కోరారు. ఆయనతో ఏకీభవించిన జడ్జి బెయిల్ పిటిషన్ను కొట్టివేశారు. ప్రస్తుతం అనంతబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు.