TG: కేరళ సీట్లు తగ్గించమని సీఎం రేవంత్ రెడ్డి కోరాలని BJP స్టేట్ చీఫ్ రామచందర్రావు అన్నారు. కేరళ కంటే తెలంగాణ జనాభా ఎక్కువని, కేరళలో 20 MP సీట్లు ఉంటే TGలో 17 మాత్రమే ఉన్నాయన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా జనాభా ఉన్న రాష్ట్రాల్లో తక్కువ సీట్లు ఇచ్చారని గుర్తుచేశారు. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ చేయాలని రాహుల్ కొత్త పార్లమెంట్ భవనంలో కోరినట్లు చెప్పారు.