AP: మాజీ సీఎం జగన్ అరాచకాలకు బీసీలు బలవుతున్నారని మంత్రి సవిత ఆరోపించారు. ‘జగన్ ఆదేశాలతోనే పెద్దదస్తగిరి హత్య జరిగింది. అధికారం, డబ్బు కోసం ఎవరినైనా చంపించడమే జగన్ లక్ష్యం. YCP ఎన్నికల గుర్తు ఫ్యాన్ కాస్త.. గొడ్డలిగా మారుతోంది. జగన్ కోసం పెద్దదస్తగిరి అన్నీ తానై వ్యవహరించాడు. దస్తగిరి మరణించినప్పుడు ఆయన కుటుంబాన్ని జగన్ ఎందుకు పరామర్శించలేదు’ అని ప్రశ్నించారు.