TG: తెలంగాణ తొలి దశ, మలిదశ ఉద్యమకారులకు న్యాయం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల నేతలతో సమావేశం నిర్వహించామని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవారికి న్యాయం చేస్తామని, దీనిపై సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. అలాగే అన్ని యూనివర్సిటీల విద్యార్ధి సంఘాలను కూడా కలుస్తామని MLC కోదండరాం చెప్పారు.