TG: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఎయిర్పోర్టుకు రావాల్సిన 13 విమానాలు, ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు బయలుదేరాల్సిన 12 విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొత్తం 25 సర్వీసులు నిలిచిపోయాయి. ప్రయాణికులు తమ ప్రయాణ వివరాలను విమానయాన సంస్థల ద్వారా సరిచూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.