AP: రాష్ట్రంలో ఉన్న ఫిషింగ్ హర్బర్లను మత్స్యకారులకు దూరం చేసే కుట్రలు జరుగుతున్నాయని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆరోపించారు. మొదటి నుంచి మత్స్యకారులకు తోడుగా, అండగా నిలిచింది జగనే అని అన్నారు. వైసీపీ హయాంలో పది ఫిషింగ్ హర్బర్ల నిర్మాణం జరిగిందని గుర్తు చేశారు. కానీ, కూటమి ప్రభుత్వం మళ్లీ మత్స్యకారుల జీవితాలను చీకట్లోకి నెట్టేస్తోంది అని విమర్శించారు.