AP: శ్రీకాళహస్తిలో కూటమి నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. YCP MLAలు, MLCలు రాజీనామా చేయాలని పట్టుబడుతున్నారు. YCP హయాంలో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని MLA బొజ్జల సుధీర్ పేర్కొన్నారు. లడ్డూలోనే ఇంత స్కామ్ జరిగిందంటే ఇతర అంశాల్లో ఇంకెంత అవినీతి జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలు కాపాడాలని చంద్రబాబు, పవన్, లోకేష్‌ను కోరుతున్నామని తెలిపారు.