TG: భూకబ్జా ఆరోపణలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. 20 ఏళ్లుగా తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. షబ్బీర్ అలీ అవినీతి మొత్తం బయటపెడతానని, వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. తాను ఎలాంటి భూకబ్జాలకు పాల్పడలేదన్నారు. కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలపై భూముల వివరాల కోసం RTIకి దరఖాస్తు చేసినట్లు తెలిపారు.