AP: రాష్ట్రంలో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలో నమోదవుతోంది. వేసవిలో గరిష్ట డిమాండ్ 280 మిలియన్ యూనిట్లు (ఎంయూలు)గా అధికారులు అంచనా వేశారు. మార్చి రెండో వారంలోనే ఒకరోజు విద్యుత్ వినియోగం 274.85 ఎంయూలుగా నమోదైంది. రోజువారీ వాడకం సగటున 270 ఎంయూలుగా ఉంది. ఏప్రిల్ నుంచి పంటల సీజన్ ముగియనుండటంతో వ్యవసాయ విద్యుత్ వినియోగం 35 ఎంయూల వరకు తగ్గొచ్చని తెలిపారు.