NRPT: జిల్లా నూతన కలెక్టర్‌గా ప్రతీక్ జైన్ సోమవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు నూతన కలెక్టర్‌ను అదనపు కలెక్టర్ ఫణీందర్ రెడ్డి, ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్, ఏవో శ్రీధర్ పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా కలెక్టరేట్ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.