TG: రాష్ట్రంలో అత్యధికంగా 16.40 శాతం బ్రాహ్మణుల ఇళ్లలో సొంత కార్లున్నాయి. ఓసీల వద్ద ఓబీసీల కంటే మూడు రెట్లు, ఎస్సీలు, ఎస్టీల కంటే ఐదు రెట్లు అధికంగా కార్లున్నాయి. రాష్ట్రంలో సగటున 3.20 శాతం కుటుంబాలకు కార్లున్నాయి. బ్రాహ్మణుల తర్వాత రాజులు, కమ్మ, కాపు, వైశ్యులు, వెలమ, జైన్ల కుటుంబాల వారికి కార్లు ఉన్నాయి. ఎస్టీ కొలాంలో అతి తక్కువగా ఉన్నాయి.