TG: హైదరాబాద్‌లో పలుచోట్ల అర్థరాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట, కూకట్పల్లి, కేపీహెచ్‌బీ, బాచుపల్లి, మియాపూర్, చందానగర్, లింగపల్లి, తార్నాక, సికింద్రాబాద్, ఖైరతాబాద్‌తో సహ పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. దీంతో రోడ్లపై నీరు నిలిచిపోయింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.