TG: ఆర్టీసీ ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. అర్ధరాత్రి నుంచి సమ్మె బాట పట్టారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు వాణిజ్య కార్లు, ఆటోలకు CNG కష్టాలు తప్పడం లేదు. పెట్రోల్ బంకుల వద్ద దాదాపు 3కి.మీల మేర ఆటోలు, కార్లు బారులు తీరాయి. అక్కడే వారికి 3 నుంచి 4 గంటల సమయం పడుతుందని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.