AP: సీఎం చంద్రబాబును విమర్శించే స్థాయి మాజీ సీఎం జగన్కు లేదని మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి మండిపడ్డారు. వారి బెదిరింపులకు ఎవరూ భయపడరన్నారు. ప్రాజెక్టులు, పోర్టులపై జగన్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు. రాష్ట్రంలో గన్ కల్చర్ తెచ్చిందే జగన్ అని ఆరోపించారు. నెల్లూరు ప్రజలు వారిని తిరస్కరించారని, జువ్వలదిన్నె వెళ్లి వారి జీవితాలు నాశనం చేయొద్దని సూచించారు.