TG: ఆర్టీసీ కార్మికుల సమ్మెకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఇవాళ్టితో ఆర్టీసీ జేఏసీ గడువు ముగియనుంది. ఈ అర్ధరాత్రి నుంచి కార్మికులు సమ్మెకు దిగనున్నారు. కార్మికులతో యాజమాన్యం చర్చలపై సందిగ్ధత నెలకొంది. ఇప్పటివరకు ప్రభుత్వం ఆర్టీసీ జేఏసీని చర్చలకు ఆహ్వానించలేదు. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు పూర్తిస్థాయిలో సమ్మెకు సిద్ధమవుతున్నారు. జేఏసీ నేతలు ఇప్పటికే అన్ని డిపోల్లో పర్యటించారు.