AP: మహానాయుడిగా NTR తమిళనాడు గడ్డపై రాణించారని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. ‘NTR, MGR చాలా దగ్గరి స్నేహితులు. 1983లో ఏప్రిల్ 27న MGR, NTR కలిసి తమిళనాడుకు నీళ్లు తీసుకురావడానికి తెలుగుగంగ ప్రాజెక్టును ప్రారంభించారు. నా వివాహం కూడా చెన్నైలోనే జరిగింది. ఇప్పటికీ చిత్తూరు, తిరుపతి పరిసరాళ్లో తమిళమే మాట్లాడతారు’ అని పేర్కొన్నారు.