అనకాపల్లిలో ట్రాఫిక్ పోలీసులకు ఎండల నుంచి రక్షణకు క్యాప్‌లు, గాగుల్స్, మాస్కులు బుధవారం అందజేశారు. వేసవి తాపానికి గురి కాకుండా ఉండేందుకు ఎస్పీ తుహీన్ సిన్హా, డీఎస్పీ శ్రావణి ఆదేశాల మేరకు వీటిని అందజేసినట్లు ట్రాఫిక్ సీఐ వెంకటనారాయణ తెలిపారు. ట్రాఫిక్ సిబ్బంది జాగ్రత్తలు తీసుకుంటూ విధులు నిర్వహించాలని సూచించారు.