MDK: పీఎం సూర్య ఘర్ పథకంతో గృహాలపై సౌర విద్యుత్ వ్యవస్థలు ఏర్పాటు చేసుకొని విద్యుత్ ఖర్చులు తగ్గించుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ పేర్కొన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో పీఎం సూర్యగ్రహ ప్రచార వాహనాన్ని జెండా ఊపి కలెక్టర్ ప్రారంభించారు. మండలాలు, గ్రామాలలో పర్యటించి పథకం గురించి అవగాహన కల్పించి మార్గనిర్దేశం చేస్తుందన్నారు.