W.G: పెనుమంట్ర మండలం నత్తరామేశ్వరంలో రూ.40 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని, రూ.20.80 లక్షలతో నిర్మించిన ఆయుష్మాన్ ఆరోగ్య భవనం – విలేజ్ క్లినిక్‌ను కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, మంత్రి గొట్టిపాటి రవికుమార్, MLA పితాని సత్యనారాయణ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు.