NLR: ఉదయగిరి ఆసుపత్రికి అనుబంధంగా రూ.5.75 కోట్లతో నూతనంగా ప్రసూతి భవనం నిర్మిస్తున్నారు. దీనికి నీటి కష్టాలు మొదలయ్యాయి. పిల్లర్లు బేస్ మట్టం స్థాయిలోనే సమస్య తలెత్తింది. భవన నిర్మాణం పూర్తయ్యే సరికి పరిస్థితి ఏంటని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుత్తేదారుడు ఏర్పాటు చేసిన బోరులో సరిపడా నీరు అందకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందన్నారు.