»Shilpa Shetty Ed Attached Shilpa Shetty Couples Assets Worth Crores In Money Laundering Case
Shilpa Shetty: మనీలాండరింగ్ కేసులో శిల్పాశెట్టి దంపతులు కోట్ల ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
బిట్కాయిన్లతో మోసాలకు పాల్పడిన మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ కేసులో ప్రముఖ నటి శిల్పాశెట్టి దంపతులకు చెందిన రూ.97.79 కోట్ల స్థిర, చరాస్తులను అటాచ్ చేసుకుంది.
Shilpa Shetty: ED attached Shilpa Shetty couple's assets worth crores in money laundering case
Shilpa Shetty: బిట్కాయిన్లతో మోసాలకు పాల్పడిన మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ కేసులో ప్రముఖ నటి శిల్పాశెట్టి దంపతులు ప్రమేయం కూడా ఉన్నట్లు తెలిసిందే. అయితే ఈ దంపతులపై ఈడీ చర్యలు చేపట్టింది. శిల్పా శెట్టి భర్త రాజ్‌కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల స్థిర, చరాస్తులను అటాచ్ చేసుకుంది. ఇందులో జుహులోని ఓ నివాస ఫ్లాట్ శిల్పా శెట్టి పేరు మీద ఉంది. అలాగే పుణెలోని ఓ నివాస బంగ్లా, రాజ్‌కుంద్రా పేరు మీదున్న ఈక్విటీ షేర్లను అటాచ్ చేసినట్లు ఈడీ తెలిపింది.
వేరియబుల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ 2017లో గెయిన్ బిట్‌కాయిన్ పోంజీ స్కీమ్‌ను నిర్వహించింది. ఈ బిట్కాయిన్లలో పెట్టుబడులు పెడితే నెలకు 10 శాతం లాభాలు వస్తాయని ఆశ చూపి మల్టీ-లెవల్ మార్కెటింగ్ పద్ధతిలో ఏజెంట్లు ద్వారా ముంబాయి, ఢిల్లీ నగరాల్లో అమాయకుల నుంచి రూ.6,600 కోట్లు వసూలు చేశారు. ఈ మోసం బయటకు రావడంతో దాని ప్రమోటర్లపై ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.
ఈ స్కామ్‌లో ముఖ్యమైన వ్యక్తి అమిత్ భరద్వాజ్. అతని నుంచి రాజ్ కుంద్రా 285 బిట్కాయిన్లను తీసుకున్నట్లు ఈడీ తెలిపింది. ఉక్రెయిన్‌లో బిట్‌కాయిన్ మైనింగ్ ఫామ్‌ను ఏర్పాటు చేయాలని రాజ్‌కుంద్రా ప్రణాళికలు వేసినట్లు తెలిపింది. ఈ కాయిన్లు ప్రస్తుతం రాజ్‌కుంద్రా దగ్గర ఉన్నాయని, ప్రస్తుత వాటి మార్కెట్ విలువ రూ.150 కోట్లకు పైనే ఉంటుందని వెల్లడించింది. ఈక్రమంలోనే కేసు దర్యాప్తులో భాగంగా ఆస్తులను అటాచ్ చేసుకుంది.