Railway Passengers : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. తగ్గిన రైల్వే ఛార్జీలు..!
Good News To Passengers : రైల్వే ప్రయాణికులకు దక్షిణ రైల్వే శుభవార్త తెలియజేసింది. రైల్వే ఛార్జీలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎకానమీ క్లాస్ టిక్కెట్ల ధరను తగ్గిస్తూ భారతీయ రైల్వే రీసెంట్ గా సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త ధర మార్చి 22వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిందని, బెడ్స్ యథావిధిగా అందజేస్తున్నామని రైల్వే అధికారులు అన్నారు.
రైల్వే ప్రయాణికులకు దక్షిణ రైల్వే శుభవార్త తెలియజేసింది. రైల్వే ఛార్జీలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎకానమీ క్లాస్ టిక్కెట్ల ధరను తగ్గిస్తూ భారతీయ రైల్వే రీసెంట్ గా సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త ధర మార్చి 22వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిందని, బెడ్స్ యథావిధిగా అందజేస్తున్నామని రైల్వే అధికారులు అన్నారు. ఇప్పటికే ఆన్లైన్లో లేదా వ్యక్తిగతంగా టిక్కెట్లను బుక్ చేసుకున్న ప్రయాణికులకు వారు చెల్లించిన అదనపు డబ్బు తిరిగి ఇవ్వడం జరుగుతుందని కూడా అధికారులు చెప్పారు.
రైల్వే బోర్డు ఉత్తమ, చౌకైన AC ప్రయాణం సేవను అందించడానికి 3-టైర్ ఎకానమీ కోచ్‌లను ప్రవేశపెట్టింది.ఈ కోచ్‌ల ధర సాధారణ AC 3 టైర్ కోచ్‌ల కంటే 6-7% తక్కువ.3-టైర్ ఎకానమీ క్లాస్ టికెట్ ధర గతేడాది ఏసీ-3 టైర్ టికెట్ ధరతో సమానంగా చేసినప్పటి నుంచి తగ్గించబడింది. ఏసీ 3 టైర్ కోచ్‌లో 72 బెర్త్‌లు ఉండగా, ఏసీ 3 టైర్ ఎకానమీలో 80 బెర్త్‌లు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
ఇండియన్ రైల్వే ప్రవేశపెట్టిన మొదటి సంవత్సరంలోనే ఏసీ-3 టైర్ ఎకానమీ క్లాస్ ద్వారా రూ.231 కోట్లు ఆర్జించింది. డేటా ప్రకారం, ఏప్రిల్ నుంచి ఆగస్టు 2022 వరకు, ఈ కోచ్‌లలో 15 లక్షల మంది ప్రయాణించారు, దీని వల్ల రూ.177 కోట్ల ఆదాయం వచ్చింది. రైలు ప్రయాణాన్ని ప్రయాణికులకు మరింత చౌకగా అందించడానికి రైల్వే మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఏసీ-3 టైర్ ఎకానమీ క్లాస్ టిక్కెట్ల ధరను తగ్గించడం వల్ల ఎక్కువ మంది తక్కువ ఖర్చుతో సౌకర్యవంతంగా ప్రయాణించే అవకాశం ఉంటుంది.