2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌కు ముందు గూఢచర్యం సంఘటన కలకలం రేపుతోంది. ఆర్థిక శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పని చేస్తోన్న ఓ వ్యక్తి రహస్య సమాచారాన్ని విదేశాలకు అందిస్తున్నట్లుగా ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ గుర్తించింది. అతనిని అరెస్ట్ చేసింది. నిందితుడిని సుమిత్‌గా గుర్తించారు. అతను కాంట్రాక్ట్ ఉద్యోగి. అతను డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు.
కొంతకాలంగా ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన కీలక సమాచారాన్ని విదేశాలకు అందిస్తున్నాడని పోలీసులు తెలిపారు. అందుకు బదులు అతనికి భారీ మొత్తంలో డబ్బు ముడుతోందని వెల్లడించారు. అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ కింద అతడిపై కేసు నమోదు చేశారు పోలీసులు. అతనిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. సమాచారాన్ని చెరవేసేందుకు నిందితుడు ఉపయోగించిన మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. 2024లో ఎన్నికలు ఉన్నాయి. మోడీ ప్రభుత్వానికి ఇది పూర్తి వార్షిక బడ్జెట్ అవుతుంది. నిర్మలమ్మ ఇప్పటి వరకు నాలుగు బడ్జెట్లు ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఐదవది అవుతుంది. బడ్జెట్‌కు ముందు పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల ప్రతినిధులతో కలుస్తారు. ఆర్థికవేత్తల సూచనలు, సలహాలు తీసుకుంటారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రవేశపెడుతున్న బడ్జెట్ ఇది. కాబట్టి సామాన్యుల నుండి పరిశ్రమల వరకు ఎన్నో ఆశలు, అంచనాలు పెట్టుకుంటారు.