Calcutta High Court urges to teenagers control your dreams
Calcutta High Court: కోల్ కతా హైకోర్టు (Calcutta High Court) టీనేజర్లకు కీలక సూచన చేసింది. మీ కోరికలను అదుపులోకి ఉంచుకోండి.. సమాజంలో గౌరవం కాపాడుకోవాలని కోరింది. ఓ కేసు విషయంలో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. అబ్బాయిలతోపాటు అమ్మాయిలు కూడా కోరికలను కంట్రోల్ చేసుకోవాలని కోరింది.
మైనర్ బాలికతో అబ్బాయి శృంగారంలో పాల్గొన్నాడు. విషయం స్టేషన్ వరకు వెళ్లగా.. సెషన్స్ కోర్టులో పిటిషన్ వేశారు. మైనర్‌తో శృంగారం నేరమని.. ఆ యువకుడికి కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. తన శిక్షను రద్దు చేయాలని కోరుతూ కోల్ కతా హైకోర్టును యువకుడు ఆశ్రయించాడు. ఆ పిటిషన్లో ఇరు వైపుల వాదనలు జరిగాయి.
ఆ యువకుడితో ఇష్టపూర్వకంగా రిలేషన్లో పాల్గొన్నానని తెలిపింది. పెళ్లి కూడా చేసుకున్నానని చెప్పింది. మైనర్ అని తెలుసు అని.. అయినప్పటికీ ఇష్టం ఉండటంతో చేసుకున్నానని పేర్కొంది. సుఖం కోసం ఇలా చేయొద్దని.. కోరికలను కంట్రోల్ చేసుకోవాలని కోరింది. దీంతో సమాజంలో మీకు చెడ్డ పేరు వస్తోందని పేర్కొంది. అన్నింటి కన్నా ఆత్మగౌరవం ముఖ్యం అని.. అబ్బాయిలు కూడా అమ్మాయిల గౌరవం కాపాడేలా బీహేవ్ చేయాలని కోరింది. సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును ధర్మాసనం పక్కన పెట్టింది.