»Boy Losed Hearing Ability After Using Wireless Earbuds
Earbuds ఎఫెక్ట్.. వినికిడి శక్తి కోల్పోయిన యువకుడు.. వైద్యులు ఏం చేశారంటే..?
ఇయర్ బడ్స్ పెట్టుకొని కంటిన్యూగా మ్యూజిక్ విన్నారనుకొండి అంతే సంగతులు. మీ వినికిడి సామర్థ్యం కోల్పోయే ప్రమాదం ఉంది. గోరఖ్‌పూర్‌లో ఓ యువకుడికి ఇలానే జరిగింది.
Boy Losed Hearing Ability After Using Wireless Earbuds
Earbuds: మొబైల్ కానీ కంప్యూటర్ ముందు ఇయర్ ఫోన్స్/ హెడ్ ఫోన్స్ లేదంటే బ్లూ టూత్ ఇయర్ బడ్స్ (Earbuds) వాడుతున్నాం. ముఖ్యంగా యువత సంగతి చెప్పక్కర్లేదు. ఏదైనా కొద్దీ సేపు వాడితే ఫర్లేదు.. గంటలు, గంటలు వాడితే ప్రమాదమే.. అవును ఉత్తరప్రదేశ్ గోరఖ్‌పూర్‌కు చెందిన యువకుడు ఇయర్ బడ్స్ (Earbuds) పెట్టుకొని వినికిడి శక్తిని కోల్పోయాడు.
సదరు యువకుడు ఇయర్స్ బడ్స్ (Earbuds) పెట్టుకొని గంటల తరబడి పాటలు వినేవాడట. అతను వాడే ఇయర్ బడ్స్ (Earbuds) టీడబ్ల్యూఎస్ కంపెనీకి చెందినవి.. అవీ చాలా స్మార్ట్‌గా ఉంటాయి. ఇంకేముంది అదే పనిగా పెట్టుకోవడంతో చెవిలో ఇన్ ఫెక్షన్ వచ్చింది. దీంతో చెవులు వినిపించలేదు. భయపడి వెంటనే వైద్యులను కలిశారు. ఏం జరిగిందో వివరించగా.. సర్జరీ చేశారు. దీంతో తిరిగి ఎప్పటిలాగా వినగలుగుతున్నాడు. తర్వాత హమ్మయ్యా అంటూ ఇంటికి చేరాడు.
కంటిన్యూగా ఇయర్ బడ్స్ (Earbuds) పెట్టుకోవడంతో చెవిలో తేమ పెరుగుతుంది. బ్యాక్టీరియా వృద్దికి అనుకూలిస్తోంది. దీంతో వినికిడి సామర్థ్యం కోల్పోతారట. అందుకే చెవిలో ఎక్కువ సమయం ఇయర్ ఫోన్స్, బడ్స్ పెట్టుకోకూడదు. ఇదే విషయం వైద్యులు, పెద్దలు కూడా చెబుతారు. ఇయర్ బడ్స్ (Earbuds) గంటల తరబడి కాకుండా కొన్ని నిమిషాల పాటు పెట్టుకొని, తీసి విరామం ఇవ్వాలని కోరుతున్నారు. వ్యాల్యూమ్ 60 శాతం మించి పెట్టుకోకూడదని తెలిపారు. లేదంటే చెవి లోపలికి వెళ్లేవి కాక బయట పెట్టుకునే హెడ్ సెట్ ధరించాలని సూచిస్తున్నారు.