యంగ్ టైగర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తే.. మామూలుగా ఉండదని నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పట్లో అది సాధ్యమయ్యేలా లేదు. అయితే.. 2034 సీఎం ఎన్టీఆర్ అనే వీడియో ఒకటి వైరల్‌గా మారింది.
Viral Video: గతంలో టీడిపి తరపున ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం రాజకీయంగా దూరంగా ఉంటున్నాడు. కానీ నందమూరి అభిమానులు మాత్రం ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని.. సమయం వచ్చినప్పుడల్లా చెబుతునే ఉన్నారు. ఫ్యూచర్లో ఎప్పటికైనా తారక్ టీడీపీ బాధ్యతలు చేపడతారని.. ఖచ్చితంగా సీఎం అవుతారనే నమ్మకంతో ఉన్నారు. కానీ ఈ విషయంలో మాత్రం ఎన్టీఆర్ మౌనంగానే ఉంటున్నారు. ప్రస్తుతానికైతే తన ఫోకస్ అంతా సినిమాల పైనే ఉంది. పాన్ ఇండియా లెవల్లో దేవర, వార్ 2 సినిమాలు చేస్తున్నాడు.
ప్రజెంట్ ముంబైలో వార్ 2 షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్. ఈ నేపథ్యంలో నటుడు అక్బర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ముంబైలో ఓ పార్టీలో వార్ 2 చిత్ర యూనిట్‌తో కలిసి పాల్గొన్నాడు ఎన్టీఆర్. ఈ పార్టీలో బాలీవుడ్ నటుడు అక్బర్ బిన్ తబర్ కూడా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ గురించి ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. సీనియర్ ఎన్టీఆర్‌ని గుర్తు చేస్తూ, ఒక డైలాగ్ చెబుతూ.. అలాంటి వాయిస్ మళ్లీ మీలో చూశాను. తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది సూపర్ స్టార్లు ఉన్నారు. వాళ్లందరికి నువ్వు ఫాదర్లాంటోడివి.. అంటూ ప్రశంసలు కురిపించారు.
అంతేకాదు.. 2034 ఎన్నికల్లో మీరే సీఎం అంటూ చెప్పుకొచ్చాడు. ఈ సమయంలో ఎన్టీఆర్ నవ్వుతూ కనిపించాడు. దీంతో.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఖచ్చితంగా తారక్ ఫ్యూచర్లో పొలిటికల్ ఎంట్రీ ఇస్తాడని అంటున్నారు. ఏదేమైనా.. ఎన్టీఆర్ సీఎం అనే మాట తరచుగా టైగర్ ఫ్యాన్స్ నుంచి వింటునే ఉన్నాం. మరి ఎన్టీఆర్ ఎప్పుడు రంగంలోకి దిగుతాడో చూడాలి.