లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన లియో సినిమాలో తమిళ సీనియర్ యాక్టర్ మన్సూర్ అలీఖాన్ కూడా నటించాడు. అయితే.. తాజాగా ఈయన త్రిషను ఉద్దేశించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశాడు. దీంతో అతని పై త్రిష మండిపడింది. త్రిషకు మద్దతుగా తమిళ హీరోలు నిలిచారు. అలాగే టాలీవుడ్ యంగ్ హీరో కూడా సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేశాడు.
త్రిష హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి రెండు దశాబ్దాలు అవుతోంది. చాలామంది స్టార్ హీరోలతో కలిసి నటించింది. ఎన్నో విజయాలను అందుకుంది. అయితే ఇక త్రిష కెరీర్ అయిపోయింది అని అనుకుంటున్న సమయంలో సాలిడ్ బౌన్స్ బ్యాక్ అయింది. పొన్నియన్ సెల్వన్ సినిమాలో ఐశ్వరరాయ్ని సైతం డామినేట్ చేసేంత అందంగా కనిపించింది త్రిష. దీంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చేసింది అమ్మడు. రీసెంట్గా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సరసన నటించిన లియో సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. హిట్ టాక్, ఫ్లాప్ టాక్ పక్కన పెడితే.. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా.. వరల్డ్ వైడ్‌గా భారీ వసూళ్లను రాబట్టి, సెన్సేషన్ క్రియేట్ చేసింది.
నితిన్ షేర్ చేసిన పోస్ట్:
I strongly condemn Mr. Mansoor Ali Khan's vile and vulgar statement against @trishtrashers.
Chauvinism has no place in our society. I urge everyone to stand up against such remarks against women in our industry.. https://t.co/k8WdzRS422
అయితే ఈ చిత్రంలో సీనియర్ యాక్టర్ మన్సూర్ అలీఖాన్ కూడా నటించాడు. తాజాగా ఈయన త్రిషను ఉద్దేశించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నేను చాలా సినిమాల్లో రేప్ సీన్స్‌లో నటించా.. ‘లియో’ ఆఫర్ వచ్చినప్పుడు త్రిషతో కూడా ఇలాంటి సీన్ చేసే అవకాశం ఉంటుందేమోనని అనుకున్నా. కానీ అందులో అలాంటి సీన్ లేదు.. చాలా బాధ పడ్డాను..’ అని చెప్పాడు. దీంతో అతని వ్యాఖ్యలపై త్రిష చాలా సీరియస్‌గా స్పందించింది. ‘అలాంటి నీచమైన వ్యక్తితో తెరను పంచుకోనందుకు చాలా ఆనందంగా ఉంది. ఇకపై కూడా నటించకుండా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటా. ఇలాంటివాళ్లు మన జాతికే సిగ్గుచేటు’ అంటూ మండిపడింది.
ఈ విషయంలో లోకేశ్ కనగరాజ్, మాళవికా మోహనన్.. తదితరులు త్రిషకు మద్దతు పలికారు. టాలీవుడ్ నుంచి హీరో నితిన్ మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలను ఖండించాడు. ‘మిస్టర్ మన్సూర్ అలీ ఖాన్ యొక్క నీచమైన మరియు అసభ్యకరమైన ప్రకటనను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి వాటికి మన సమాజంలో స్థానం లేదు. మన పరిశ్రమలో మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ నిలబడాలని నేను కోరుతున్నాను’.. అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. అన్నట్టు.. గతంలో నితిన్, త్రిష కలిసి ‘అల్లరి బుల్లోడు’ అనే సినిమాలో నటించారు. ఏదేమైనా.. త్రిష వ్యవహారం ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.