»Sameera Reddy Ntr Wants To Increase The Size Of The Heroine
Sameera Reddy: ఎన్టీఆర్ హీరోయిన్ను వాటి సైజ్ పెంచమన్నారా?
ఎన్టీఆర్ హీరోయిన్ అంటే.. ఇప్పుడు నటిస్తున్న హీరోయిన్ కాదు. గతంలో ఎన్టీఆర్‌తో ఒకటి రెండు సినిమాల్లో నటించిన సమీరా రెడ్డి తాజాగా చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. వాటి సైజులు పెద్దగా కనిపించడానికి అలా చేయమన్నారట.
Sameera Reddy: వెటరన్ బ్యూటీ సమీరా రెడ్డి పేరు వింటే.. ఎన్టీఆర్ హీరోయిన్‌గానే గుర్తొస్తుంది. ఎందుకంటే.. తెలుగులో ఎన్టీఆర్ సినిమాతోనే ఎంట్రీ ఇచ్చింది అమ్మడు. నరసింహుడు సినిమాలో ఎన్టీఆర్‌తో కలిసి రొమాన్స్ చేసిన సమీరా రెడ్డికి.. ఈ సినిమా ఫ్లాప్ అయినా కూడా మెగాస్టార్‌తో ఛాన్స్ అందుకుంది. చిరంజీవికి జంటగా జై చిరంజీవ సినిమాలో నటించింది సమీరా. అయినా కూడా అమ్మడికి ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. అయితే హీరోయిన్గా టాలీవుడ్లో స్టార్ డమ్ అందుకోలేకపోయిన ఈ బ్యూటీ.. రెండోసారి ఎన్టీఆర్‌తో ఛాన్స్ అందుకొని హాట్ టాపిక్ అయింది.
ఎన్టీఆర్, సురేందర్ రెడ్డి కాంబినేషన్లో వచ్చిన అశోక్ సినిమాలో మరోసారి ఎన్టీఆర్‌తో రొమాన్స్ చేసింది ఈ బ్యూటీ. ఈ సినిమా రిజల్ట్ సంగతి పక్కన పెడితే.. ఎన్టీఆర్, సమీరా మధ్య ఎఫైర్ ఉందనే న్యూస్ అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది సమీరా. చివరగా కృష్ణం వందే జగద్గురు సినిమాలో ఐటెం సాంగ్ చేసింది. ఇక 2014లో పెళ్లి చేసుకుని నటనకు గుడ్ బై చెప్పింది. అయితే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమీరా రెడ్డి తన సినీ కెరీర్ స్టార్టిఇంగ్లో ఎదురైన అనుభవాలు గుర్తు చేసుకుంది.
అప్పట్లో నా బ్రెస్ట్ సైజ్ చిన్నగా ఉందని కామెంట్స్ చేశారు. సర్జరీ చేయించుకోమని కొందరు సలహా ఇచ్చారు. దీంతో తాను ఒత్తిడికి గురయ్యాను. అంతేకాదు.. సర్జరీ కూడా చేయించుకోవాలని నిర్ణయం తీసుకున్నాను. కానీ అలా చేయలేకపోయాను. అయితే.. సినిమాల్లో బ్రెస్ట్ సైజ్ పెద్దగా కనిపించడానికి ప్యాడ్స్ వాడేదాన్ని. ఒకవేళ అప్పుడు నేను సర్జరీ చేయించుకుని ఉంటే.. ఇప్పుడు సంతోషంగా ఉండేదాన్ని కాదు. అందుకే.. ఇలాంటి విషయాల్లో సర్జరీకి దూరంగా ఉండాలనేది నా సలహా.. అని సమీరా చెప్పుకొచ్చింది. దీంతో ప్రస్తుతం సమీరా కామెంట్స్ వైరల్‌గా మారాయి.