»Ram Charan Will Share The Stage With Prime Minister Modi And Sachin
Ram Charan : ప్రధాని మోదీ, సచిన్‌లతో వేదిక పంచుకోనున్న రామ్ చరణ్!
Ram Charan : ఆస్కార్ అవార్డ్ తెలుగు సినిమాలకు అసాధ్యం అనుకున్నది.. సుసాధ్యం చేసి చూపించారు దర్శక ధీరుడు రాజమౌళి. ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు దక్కింది. ఎన్నో ఏళ్లుగా భారతీయులంతా ఎదురుచూసున్న కల నిజం అయింది.
ఆస్కార్ అవార్డ్ తెలుగు సినిమాలకు అసాధ్యం అనుకున్నది.. సుసాధ్యం చేసి చూపించారు దర్శక ధీరుడు రాజమౌళి. ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు దక్కింది. ఎన్నో ఏళ్లుగా భారతీయులంతా ఎదురుచూసున్న కల నిజం అయింది. దీంతో ఆర్ఆర్ఆర్ యూనిట్ పై ప్రశంసలు వర్షం కురుస్తోంది. ట్రిపుల్ ఆర్ టీం అమెరికా నుంచి రాగానే ఘనంగా సన్మానించేందుకు రెడీ అవుతున్నారు సినీ ప్రముఖుల, రాజకీయ నేతలు. ఈ నేపథ్యంలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఘన సత్కారం అందుకోబోతున్నారు చరణ్. న్యూఢిల్లీ వేదికగా ఈనెల 17,18 తేదీల్లో ఇండియా టుడే కాన్ క్లేవ్ జరగనుంది. ఈ ప్రతిష్ఠాత్మక ఈవెంట్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఇదే వేడుకకు సచిన్ టెండూల్కర్‌తో పాటు.. రామ్‌చరణ్ కూడా పాల్గొనబోతున్నారు. ఈ సందర్భంగా చరణ్‌ని.. ప్రధాని మోదీ ఘనంగా సన్మానించబోతున్నారని తెలుస్తోంది. ఈ వేదిక పై మెగా పవర్ స్టార్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు, ఆస్కార్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకోనున్నాడని సమచారం. ప్రస్తుతం ఈ న్యూస్ మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇస్తోంది. ఇప్పటికే చరణ్ హాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాడు. ఇక ఇప్పుడు ఇండియాకు రావడమే ఆలస్యం.. ఏకంగా ప్రధాని మోదీ, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌తో కలిసి వేదిక పంచుకోబోతున్నారు. ఏదేమైనా.. ఆర్ఆర్ఆర్ మూవీతో రాజమౌళి హిస్టరీ క్రియేట్ చేసేశారు.