Prabhas Vs Charan : పోయిన సంక్రాంతికి దిల్ రాజు 'వారసుడు' మూవీ థియేటర్ల విషయంలో.. ఎంత రచ్చ జరిగిందో అందరికీ తెలిసిందే. అయితే ఫైనల్‌గా వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య తర్వాతే 'వారసుడు'ని థియేటర్లోకి తీసుకొచ్చారు దిల్ రాజు. కానీ నెక్స్ట్ సంక్రాంతికి మాత్రం కాస్త ముందే రాబోతున్నట్టు తెలుస్తోంది.
పోయిన సంక్రాంతికి దిల్ రాజు ‘వారసుడు’ మూవీ థియేటర్ల విషయంలో.. ఎంత రచ్చ జరిగిందో అందరికీ తెలిసిందే. అయితే ఫైనల్‌గా వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య తర్వాతే ‘వారసుడు’ని థియేటర్లోకి తీసుకొచ్చారు దిల్ రాజు. కానీ నెక్స్ట్ సంక్రాంతికి మాత్రం కాస్త ముందే రాబోతున్నట్టు తెలుస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఆర్సీ 15ని, 2024 సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. కానీ ఇప్పటికే ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కె’ సంక్రాంతి బరిలో ఉంది. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను జనవరి 12న రిలీజ్ చేయబోతున్నారు. దాంతో ఆర్సీ 15 రిలీజ్ ఉంటుందా.. అనే డౌట్స్ ఉండేవి. కానీ ఈసారి కూడా దిల్ రాజు తగ్గేదేలే అంటున్నారట. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం.. RC15ని జనవరి 10 రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారట. దీనిపై మార్చి 27న క్లారిటీ రానుంది. ఆ రోజు రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఆర్సీ 15 టైటిల్ అండ్ ఫస్ట్ లుక్‌తో పాటు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు శంకర్. ఒకవేళ నిజంగానే ఆర్సీ 15 సంక్రాంతికి వస్తే.. బాక్సాఫీస్ వార్ గట్టిగా ఉంటుందని చెప్పొచ్చు. ప్రభాస్, చరణ్ ఇద్దరికీ పాన్ ఇండియా స్టార్ డమ్ ఉంది. అలాంటి ఈ స్టార్ హీరోలు పోటీ పడితే.. పాన్ ఇండియా బాక్సాఫీస్ షేక్ అవాల్సిందే. అయితే ‘ప్రాజెక్ట్ కె’ని పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తున్నారు. దాదాపు 500 కోట్లు ఖర్చు చేస్తున్నారు వైజయంతీ మూవీస్ వారు. అసలు నాగ్ అశ్విన్ ఈ సినిమాను ఎలా రూపొందిస్తున్నాడో.. చిన్న హింట్ కూడా లేదు. కానీ ఆర్సీ మాత్రం శంకర్ స్టైల్లో పవర్ ఫుల్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో రాబోతోంది. ఈ రెండు సినిమాల పై భారీ అంచనాలున్నాయి. కాబట్టి ఆర్సీ 15, ప్రాజెక్ట్ కె వార్ ఎలా ఉంటుందో చూడాలి.