• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

‘వేట్టయాన్‌’పై రజినీకాంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

తమిళ హీరో రజినీకాంత్ ప్రధాన పాత్రలో టీజే జ్ఞానవేల్ తెరకెక్కిస్తున్న మూవీ ‘వేట్టయాన్‌’. తాజాగా ఈ సినిమాపై రజినీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ మూవీపై ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలను అందుకుంటామని అన్నారు. ‘మా సినిమాపై ప్రేక్షకులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. వాటిని ఈ మూవీ అందుకుంటుందని నేను ఆశిస్తున్నా. గతంలో నేను నటించిన దర్బార్ కూడా పోలీస్ యాక్షన్ డ్రామానే. కాకపోతే ఈ...

September 28, 2024 / 11:35 AM IST

ఆ రోజున కిరణ్ అబ్బవరం ‘క’ రిలీజ్..?

టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం, నయన్ సారిక జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘క’. తాజాగా ఈ మూవీ రిలీజ్‌కు సంబంధించిన న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ఈ చిత్రాన్ని అక్టోబర్ చివరి వారంలో రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాకు సుజిత్, సందీప్‌లు దర్శకత్వం వహించారు.

September 28, 2024 / 10:55 AM IST

బాలకృష్ణకు స్పెషల్ అవార్డు

నటసింహం నందమూరి బాలకృష్ణ సినీ ఇండస్ట్రీలోకి వచ్చి 50ఏళ్లు పూర్తయిన విషయం తెలిసిందే. ఇందుకు గాను IIFA-2024 వేడుకలో ఆయన స్పెషల్ అవార్డు అందుకున్నారు. బాలీవుడ్ స్టార్ నిర్మాత కరణ్ జోహార్ చేతుల మీదుగా ఆయన ‘ఐఫా గోల్డెన్ లెగసీ’ అవార్డును అందుకున్నారు. అవార్డు ఇచ్చే ముందు కరణ్ బాలయ్య పాదాలకు నమస్కరించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అలాగే సమంత ‘వుమెన్ ఆఫ...

September 28, 2024 / 10:30 AM IST

PHOTO MOMENT: ఒకే ఫ్రేమ్‌లో స్టార్ హీరోలు

ఒకే ఫ్రేమ్‌లో ముగ్గురు స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్ కనిపించారు. తాజాగా అబుదాబిలో జరిగిన IIFA వేడుకలో చిరు, బాలయ్య, వెంకీలతో పాటు పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా ఆ ముగ్గురిని ఒకేసారి స్టేజ్‌పైకి పిలిచారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.

September 28, 2024 / 09:40 AM IST

ఎన్టీఆర్ దేవర సినిమా చూశారా..?

దాదాపు ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ సోలోగా వచ్చిన దేవర చిత్రం నిన్న విడుదలైంది. కొరటాల శివ దర్శకత్వం వహించడంతో.. ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఈ చిత్రంపై అభిమానుల నుంచి మిక్స్‌డ్ టాక్ వస్తోంది. కొందరు యావరేజ్ అని, మరికొందరు అస్సలు బాగాలేదని, ఇంకొందరు బాగుంది అని రకారకాలుగా చెబుతున్నారు. మరి మీరు ఈ సినిమా చూశారా..? మీకెలా అనిపించింది. కామెంట్ చేయండి.

September 28, 2024 / 09:33 AM IST

20ఏళ్ల తర్వాత హిట్ సినిమా రీరిలీజ్

తమిళ హీరో శింబు, జ్యోతిక జంటగా నటించిన రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘మన్మధ’ 2004 రిలీజై మంచి విజయం సాధించింది. 20ఏళ్ల తర్వాత ఈ సినిమా తెలుగులో రీరిలీజ్ కానుంది. అక్టోబర్ 5న ఈ చిత్రం మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మేరకు పోస్టర్ విడుదలైంది. A.J మురుగన్ తెరకెక్కించిన ఈ మూవీకి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించారు.

September 28, 2024 / 09:30 AM IST

నార్త్ అమెరికాలో అదరగడుతోన్న ‘దేవర’

కొరటాల శివ దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించిన దేవర సినిమా నిన్న విడుదలైంది. నార్త్ అమెరికాలో ఈ సినిమా అదరగొడుతోంది. అక్కడ 3.5 మిలియన్ డాలర్లు గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఈ మేరకు అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ స్పెషల్ పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ కథానాయికగా నటించగా.. సైఫ్ అలీఖాన్ విలన్ పాత్ర పోషించారు.

September 28, 2024 / 09:00 AM IST

IIFA-2024 అవార్డు గ్రహీతలు వీళ్లే!

✦ ఉత్తమ నటుడు – నాని (తెలుగు), విక్రమ్ (తమిళం)✦ ఉత్తమ నటి – ఐశ్వర్యారాయ్ (తమిళం)✦ సహాయ నటుడు – జయరామ్✦ ఉత్తమ సినిమాటోగ్రఫీ – మిస్‌శెట్టి మిస్టర్ పొలిశెట్టి✦ ఉత్తమ సాహిత్యం – జైలర్ (హుకుం)✦ ఉత్తమ నేపథ్య గాయకుడు – చిన్నంజిరు (తమిళం)✦ ఉత్తమ నేపథ్య గాయని – శక్తిశ్రీ గోపాలన్ (తమిళం)

September 28, 2024 / 07:42 AM IST

దేవర తొలిరోజు కలెక్షన్లు ఎంతంటే..?

భారీ అంచనాలతో విడుదలై మిక్స్‌డ్ టాక్ అందుకున్న దేవర సినిమా.. తొలిరోజు అదిరిపోయే కలెక్షన్లు సాధించినట్లు తెలుస్తోంది. నిన్న ఒక్కరోజే రూ.140కోట్లు వసూలు చేసినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. తెలుగురాష్ట్రాల్లో రూ.60-70 కోట్లు వచ్చినట్లు సమాచారం. హిందీలో రూ.7కోట్లు.. మిగతా భాషలతో పాటు ఓవర్సీస్‌లో కలుపుకొని రూ.140కోట్లు వచ్చాయని అంచనా. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

September 28, 2024 / 07:06 AM IST

సత్యం సుందరం 2024 మూవీ రివ్యూ

‘96’ సినిమాతో ప్రేక్షకుల హృదయాలు దోచుకున్న ప్రేమ్ కుమార్.. ఆరేళ్ల తరువాత  కార్తీ, అరవింద్ స్వామీలతో మరో ఎమోషనల్ సినిమాతో ముందుకొచ్చారు. సినిమా కాస్త నెమ్మదిగా కొనసాగినా అన్ని రకాల ఎమోషన్స్‌తో అదరగొట్టారని చెప్పవచ్చు. పూర్తిగా గ్రామీణ వాతావరణంతో సాగిన ఈ కథతో.. ప్రేక్షకులను దర్శకుడు గతంలోకి తీసుకెళ్లాడు. ముఖ్యంగా కార్తీ, అరవింద్ స్వామీల మధ్య సాగే కథ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ర...

September 28, 2024 / 06:40 AM IST

మరో అవార్డు అందుకున్న చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవిని మరో ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. యూఏఈలోని అబుదాబిలో ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ(IIFA) అవార్డ్స్‌- 2024 వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ‘ఔట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇండియన్ సినిమా’ అవార్డును చిరు అందుకున్నారు. ఈ అవార్డు రావడం పట్ల చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చిరుని బాలయ్య కౌగిలించుకున్నారు.

September 28, 2024 / 06:00 AM IST

ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘35’ మూవీ

ఇటీవల విడుదలై ప్రేక్షకులను అలరించిన ’35- ఓ చిన్న కథ కాదు’ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’ వేదికగా అక్టోబరు 2వ తేదీ నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్‌ కానుంది. సెప్టెంబర్ 6న థియేటర్లలో విడుదలైన ’35- ఓ చిన్న కథ కాదు’ సినిమా సంచలన విజయం సాధించింది. నివేదా థామస్, ప్రియదర్శి కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరించారు.

September 27, 2024 / 06:09 PM IST

సుప్రీంకోర్టులో ‘12th ఫెయిల్’ ప్రదర్శన

సుప్రీంకోర్టులో ‘12th ఫెయిల్’ సినిమాను ప్రదర్శించారు. ఐపీఎస్ మనోజ్ కుమార్ శర్మ జీవితం ఆధారంగా విధు వినోద్ చోప్రా దర్శకత్వం వహించిన చిత్రం ‘12th ఫెయిల్’. విక్రాంత్ మస్సే కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం తాజాగా అరుదైన గౌరవాన్ని అందుకుంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో పాటు దాదాపు 600 మంది న్యాయవాదులు, ఇతర అధికారుల కోసం సుప్రీంకోర్టులో దీనిని ప్రత్యేకం...

September 27, 2024 / 04:15 PM IST

తమలపాకులతో పలు సమస్యలకు చెక్

తమలపాకులతో పలు సమస్యలకు చెక్ పెట్టవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌‌తో పోరాడుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. మలబద్ధకం సమస్య దూరం అవుతుంది. శ్వాస సంబంధిత సమస్యలు తగ్గుతాయి. నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్త ప్రసరణ సాఫీగా సాగుతుంది. నిద్రలేమి సమస్య నుంచి బయటపడవచ్చు. కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి.

September 27, 2024 / 03:41 PM IST

మీ ప్రేమకు ఎప్పుడూ రుణపడి ఉంటా: ఎన్టీఆర్

‘దేవర’ రిలీజైన సందర్భంగా NTR ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. తాను ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తున్న రోజు వచ్చిందన్నారు. తనపై అభిమానులు చూపిస్తున్న ప్రేమకు ఎప్పుడూ రుణపడి ఉంటానని పేర్కొన్నారు. అద్భుతమైన డ్రామా, భావోద్వేగాలతో దేవరను తెరకెక్కించిన కొరటాల శివకు, మంచి సంగీతం అందించిన అనిరుధ్, నిర్మాతలు, మూవీ టీం అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. తన ఫ్యాన్స్‌కు మరింత వినోదాన్...

September 27, 2024 / 03:11 PM IST