మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీ టీజర్ ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా? అని ఎదురుచూస్తున్న అభిమానులకు మేకర్స్ శుభవార్త చెప్పారు. నవంబర్ 9న టీజర్ రిలీజ్ చేస్తున్నట్లు తెలియజేస్తూ ఫొటోను షేర్ చేశారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది.
సినీ నటుడు కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘క’ సినిమా ఇవాళ విడుదలై మంచి రెస్సాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమాపై నిర్మాత శ్రీనివాస్ నాయుడు ట్వీట్ చేశారు. ‘ఫస్టాఫ్ చాలా డీసెంట్‌గా ఉంది. చివరి 30 ననిమిషాలు మాత్రం అరుపులే. ప్రీ ఇంటర్వెల్ క్లైమాక్స్ థ్రిల్లింగ్. మ్యూజిక్ అదిరిపోయింది. కెమెరామెన్ పనితనం, క్వాలిటీ వేరే లెవల్’ అంటూ రాసుకొచ్చారు. తాజాగా దీనిపై స్పందించిన కిరణ్ అబ్బవ...
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కించిన ‘లక్కీ భాస్కర్’ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సినిమాకు సాలిడ్ రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ మూవీని నందమూరి బాలకృష్ణ వీక్షించారు. జూబ్లీహిల్స్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో ఆయన చూశారు. ఇక ఈ సినిమాలో దుల్కర్‌కు జోడీగా మీనాక్షి చౌదరి నటించింది.
ప్రముఖ OTT సంస్థ ‘ఆహా’ కొత్త ప్రాజెక్టును ప్రకటించింది. పురాణాల నేపథ్యంలో వెబ్ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నట్లు వెల్లడించింది. దీనికి మేకర్స్ ‘చిరంజీవ’ అనే టైటిల్ పెట్టారు. అభినయ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్ డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆహా పోస్టర్ షేర్ చేసింది.
శివకార్తీకేయన్ ‘అమరన్’ మూవీ భారత ఆర్మీ ఆఫీసర్ మేజర్ ముకుంద్ బయోపిక్‌గా తెరకెక్కింది. ఆయన జీవితాన్ని దర్శకుడు రాజ్‌కుమార్ పెరియస్వామి అద్భుతంగా తెరకెక్కించాడు. శివ కార్తీకేయన్ నటన, సాయిపల్లవి స్క్రీన్ ప్రజెన్స్ హైలెట్స్. డైలాగ్స్, ఎమోషనల్ సన్నివేశాలు, మ్యూజిక్ కూడా ఆకట్టుకుంటుంది. అయితే కథనం నెమ్మదిగా సాగడం, పెద్దగా ట్విస్టులు లేకపోవడం మైనస్. రేటింగ్: 3.25/5.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మికా మందన్న జంటగా నటిస్తోన్న ‘పుష్ప 2’ మూవీ డిసెంబర్ 5న విడుదల కానుంది. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని మేకర్స్ విషెస్ తెలిపారు. ఈ మేరకు మూవీ నుంచి బన్నీ, రష్మికల పోస్టర్‌ను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ సినిమాను డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండగా.. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్త...
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో సుజిత్, సందీప్‌ల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘క’. థియేటర్లలో ఇవాళ విడుదలై సాలిడ్ రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ సినిమాకు సీక్వెల్ రాబోతున్నట్లు తెలుస్తోంది. పెయిడ్ ప్రీమియర్ షోల ద్వారా ఈ విషయం తెలిసింది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాలో నయన్ సారిక,...
నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న సెలబ్రిటీ టాక్ షో ‘అన్‌స్టాపబుల్’. ఈ షో నాలుగో సీజన్ స్టార్ట్ అయింది. తాజాగా ఈ షోలో ‘లక్కీ భాస్కర్’ టీం సందడి చేసింది. దీపావళి కానుకగా అనుకున్న సమయం కంటే 7 గంటల ముందుగానే ఈ ఎపిసోడ్ ఆహాలో స్టీమింగ్‌కు వచ్చింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సదరు సంస్థ పోస్టర్ షేర్ చేసింది.
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ టీ.జే జ్ఞానవేల్ తెరకెక్కించిన మూవీ ‘వేట్టయాన్’. అక్టోబర్ 10న థియేటర్లలో రిలీజై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. తాజాగా ఈ సినిమా OTT రిలీజ్ డేట్ వచ్చేసింది. నవంబర్ 8 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉండనుంది. ఈ విషయాన్ని సదరు సంస్థ అధికారికంగా ప్రకట...
దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి, ఎన్టీఆర్ విషెస్ తెలియజేశారు. ‘వెలుగు జిలుగల ఈ దీపావళి, చీకటిని పారదోలి అందరి జీవితాల్లో కాంతిని నింపాలని ఆశిస్తూ.. అందరికీ దీపావళి శుభాకాంక్షలు’ అని చిరు ట్వీట్ చేశారు. ‘మీకు, మీ కుటుంబసభ్యులకు దీపావళి శుభాకాంక్షలు’ అని ఎన్టీఆర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘అమరన్’ మూవీ ఇవాళ గ్రాండ్‌గా విడుదలైంది. ఈ మూవీని తమిళనాడు CM స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ వీక్షించారు. సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని CM స్టాలిన్ ట్వీట్ చేశారు. ‘మూవీని చాలా ఎమోషనల్‌గా తెరకెక్కించారు. మేజర్ ముకుంద్, ఇందు రెబెక్కా పాత్రలను చక్కగా చూపించారు. చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు. దేశాన్ని రక్షించే మన ...
టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటించిన ‘క’ మూవీ ఇవాళ థియేటర్లలో రిలీజై మంచి రెస్పాన్స్ దక్కించుకుంటోంది. తాజాగా ఈ సినిమా OTT అప్‌డేట్ వచ్చింది. దీని OTT హక్కులను ఈటీవీ విన్ కొనుగోలు చేసినట్లు సమాచారం. శాటిలైట్ హక్కులను ఈటీవీ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సుజిత్, స...
ఈ ఏడాది దీపావళికి టాలీవుడ్‌లో సరికొత్త సందడి నెలకొంది. సాధారణంగా అమావాస్య రోజు సినిమాలు విడుదల చేయడానికి నిర్మాతలు జంకుతారు. కానీ ఈ దీపావళికి ఎన్నడూ లేని విధంగా సినిమాలు రిలీజ్ అయ్యాయి. విడుదల కావడమే కాకుండా సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. లక్కీ భాస్కర్, క, అమరన్ సినిమాలకు మంచి రివ్యూలతో పాటు రేటింగ్‌లు వచ్చాయి. దీంతో థియేటర్లు హౌస్‌ఫుల్ బోర్డులతో్ కళకళలాడుతూ సంక్రాంతిని తలపిస్తు...
‘క’ సినిమా ప్రీమియర్లకు పాజిటివ్ టాక్ రావడంతో హీరో కిరణ్ అబ్బవరం సంతోషం వ్యక్తం చేశాడు. చాలా కాలం తర్వాత హ్యాపీగా నిద్రపోయానని ట్వీట్ చేశాడు. దీపావళిని సంతోషకరంగా మార్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశాడు. కాగా ‘క’ సినిమా దీపావళి కానుకగా ఈరోజు విడుదలైంది. ముఖ్యంగా బీజీఎం సూపర్బ్‌గా ఉందని రివ్యూలలో అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన ‘లక్కీ భాస్కర్’ మూవీ ఇవాళ విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంటోంది. తాజాగా ఈ మూవీ OTT పార్ట్‌నర్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. దీని డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం, ఇక శాటిలైట్ హక్కులను స్టార్ మా దక్కించుకుందట. డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమాలో దుల్కర్‌కు జోడీగా మీనాక్షి...