గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అయితే, మమూలుగానే తన సినిమాల్లోని సాంగ్స్‌కు కోట్ల రూపాయలను ఖర్చుపెట్టడం డైరెక్టర్ శంకర్ స్పెషాలిటీ. ఈ నేపథ్యంలోనే ‘నానా హైరానా’ సాంగ్‌ను న్యూజిలాండ్‌లో చిత్రీకరించారు. ఈ సాంగ్ కోసం ఏకంగా రూ.10 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం.