KDP: రసాయన ఎరువుల ధరలను అమాంతంగా పెంచిన మోదీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేత నర్రెడ్డి తులసి రెడ్డి తీవ్రంగా విమర్శించారు. వర్షాలు లేక, గిట్టుబాటు ధరలు రాక, అన్నదాత సుఖీభవ అమలుకాక రైతులు ఇబ్బందులు పడుతున్నారని వేంపల్లెలో సోమవారం అన్నారు. ఇలాంటి సమయంలో ధరలు పెంచడం అన్యాయమని, వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.