KNR: వీణవంక మండలంలోని కొండపాక ఇసుక క్వారీ వద్ద అర్ధరాత్రి లోడ్ కోసం వేచి ఉన్న లారీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయని స్థానికులు తెలిపారు. అక్కడే ఉన్న లారీ డ్రైవర్, స్థానికులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. అప్పటికే లారీ ముందు భాగం పూర్తిగా దగ్ధమైంది.