TG: నిజామాబాద్ జిల్లాలో చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. నాగారం 300 క్వార్టర్ వద్ద స్థానికులు ఓ చిరుతను చూసినట్లు తెలిపారు. దీంతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. చిరుత సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అయితే చిరుతను పట్టుకోవడానికి వీలుగా తక్షణమే బోనులు ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు అధికారులను కోరుతున్నారు.