KRNL: టీబీ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని కర్నూలు ఎంపీ నాగరాజు అన్నారు. పంచలింగాల గ్రామంలో నిర్వహించిన జాతీయ టీబీ నిర్మూలన కార్యక్రమంలో పాల్గొన్నారు. టీబీ బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. క్షయ వ్యాధి నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని తెలిపారు. ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.