NLG: జిల్లా అనేశ్వరం గుట్ట అవినీతిపై వరుస కథనాలు రాస్తున్న పత్రిక రిపోర్టర్‌పై ఆరుగురు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. గుట్టపై జరుగుతున్న అవినీతి కార్యక్రమాలపై ఆధారాలు సేకరించడానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది. రిపోర్టర్ ఈ ఘటనపై స్థానిక డీఎస్పీ శివరాం రెడ్డికి ఫిర్యాదు చేశాడు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.