SKLM: మెలియాపుట్టిలోని పెద్ద పద్మాపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో శక్తి యాప్ అవగాహాన కార్యక్రమం నిర్వహించారు. సోమవారం ఉదయం యాప్ సాంకేతిక పరిజ్ఞానం, మహిళా రక్షణకు యాప్ ఎలా ఉపయోగపడుతుందో వివరించారు. చరవాణిలో శక్తి యాప్ ఉంటే భద్రత మన వెంట ఉన్నట్లేనని శక్తి టీం ఇన్ఛార్జ్ ఎస్సై కే. బాలకృష్ణ, HC. గిరిధర్, టీం సభ్యులు అవగాహాన కల్పించారు.