PLD: వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు వినుకొండ పట్టణంలోని గంగినేని ఫంక్షన్ హాల్ వద్ద ఒక ప్రత్యేక కంటి శుక్లాల ఉచిత వైద్య శిబిరాన్ని సోమవారం నిర్వహించారు. ఈ శిబిరాన్ని జీవి ఆంజనేయులు, పల్నాడు జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ లాంఛనంగా ప్రారంభించారు. కంటి శుక్లాలతో బాధపడుతున్న వృద్ధులకు నిపుణుల ద్వారా ఉచితంగా పరీక్షలు నిర్వహించారు.