నాగ చైతన్య- కార్తిక్ వర్మ దండు కాంబినేషన్లో రాబోతున్న సినిమా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా మీనాక్షి చౌదరిని అనుకున్న మేకర్స్ తాజాగా హైపర్ బ్యూటీ శ్రీలీలను ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే వీరికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ని కూడా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. కానీ దీనిపై చిత్ర బృందం ఎలాంటి ప్రకటన చేయలేదు.