AP: అనంతపురం జిల్లా రాయదుర్గంలోని థియేటర్లో పుష్ప 2 చూస్తూ ముద్దానప్ప అనే అభిమాని అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. షో ముగిశాక కూడా అతను సీటులో అలానే కూర్చొని ఉండగా.. మిగతా ప్రేక్షకులకు అనుమానం వచ్చి థియేటర్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. ఘటనా స్థలానికి చేరుకున్న మృతుడి కుటుంబీకులు.. ముద్దానప్ప తొక్కిసలాట వల్లే చనిపోయాడని ఆందోళనకు దిగారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.