ఏపీలో పుష్ఫ-2 టికెట్ ధరల పెంపునకు అనుమతి లభించింది. డిసెంబర్ 4న రాత్రి 9:30 గంటలకు బెనిఫిట్ షో, ప్రీమియర్ షో టికెట్‌పై రూ.800 పెంచుకోవడానికి అనుమతి దొరికింది. కాగా ఏపీ ప్రభుత్వానికి అల్లు అర్జున్ కృతజ్ఞతలు తెలిపారు. చిత్ర పరిశ్రమకు అమూల్యమైన సహకారం అందిస్తున్నారని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లకు ప్రత్యేకంగా ధన్యావాదాలు తెలిపారు.
గుజరాత్ అల్లర్లు, గోధ్రా రైలు దహనకాండను ఆధారంగా చేసుకొని తెరకెక్కిన ‘ది సబర్మతి రిపోర్ట్’ సినిమా పార్లమెంటులో ప్రదర్శించారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, ఎంపీలతో కలిసి ఈ సినిమాను నటీనటులు విక్రాంత్ మాస్సే, రాశీఖన్నా వీక్షించారు. ఈ సందర్భంగా విక్రాంత్ మాట్లాడుతూ.. ఇదో ప్రత్యేక అనుభూతని తెలిపాడు. చాలా సంతోషంగా ఉందని చెప్పాడు. ఇది తన కెరీర్‌లో అత్యున్నత దశ అని చెప్పుకొచ్చాడు.
సన్నీ లియోనీ ప్రధాన పాత్రలో దర్శకుడు ఆర్.యువన్ తెరకెక్కించిన సినిమా ‘మందిర’. ఈ చిత్రం డిసెంబర్ 5 నుంచి ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ‘సన్నీతో ఆటలు అనుకున్నంత ఫన్నీ కాదు. జాగ్రత్తంగా ఉండండి’ అంటూ ‘ఆహా’ సోషల్ మీడియా వేదికగా పోస్టర్ పంచుకుంది. ఈ సినిమా నవంబరు 22న థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే.
సిద్ధార్థ్ హీరోగా నటించిన ‘మిస్ యు’ సినిమా కొత్త విడుదల తేదీ ఖరారైంది. ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. నవంబర్ 29న రావాల్సిన ఈ చిత్రం వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే.. తుపాను ప్రభావం ఎక్కువగా ఉండటం, తమిళనాడులో పరిస్థితులు సరిగా లేకపోవడంతో ఈ సినిమాని వాయిదా వేశారు.
ప్రముఖ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ తనమీద పెట్టిన కేసులపై తాజాగా స్పందించారు. తాను రోజుకూ 10 నుంచి 15 ట్వీట్లు, పోస్టులు పెడుతుంటానని, ఇప్పటికే తన ‘X’లో వేల ట్వీట్లు పెట్టానన్నారు. తన వల్ల ఎవరు ఇబ్బంది పడ్డారో తనకు తెలియదన్నారు. ప్రస్తుతం తనకు ఆ పోస్టుల గుర్తించి తెలియదని, ఎప్పుడు ట్వీట్ చేశానో.. అందులో ఏముందో గుర్తు లేదన్నారు. రెండేళ్ల కింద పెట్టిన పోస్టులపై ఇప్పుడు ఫిర్యాదులు ర...
సిల్వర్ స్క్రీన్‌పై 49 ఏళ్ల క్రితం మ్యాజిక్ క్రియేట్ చేసి భారతీయ సినీ చరిత్రలో ఐకానిక్ ఫిలిమ్స్‌లో ఒకటిగా నిలిచిన చిత్రం ‘షోలే’. రమేశ్ షిప్పి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఎంతోమంది సెలబ్రిటీలను ప్రభావితం చేసింది. వీరిలో హరీశ్ శంకర్ ఒకడు. తన సినిమాలపై షోలే ప్రభావం ఉంటుందని చెప్తుండే ఈ దర్శకుడికి తన అభిమాన దర్శకుడు షిప్పిని కలిసే అరుదైన అవకాశం లభించింది. ఈ విషయాన్ని హరీశ్ సోషల్ మీ...
కన్నడ సీరియల్ నటి శోభిత ఆత్మహత్యపై ఆమె భర్త తండ్రి బుచ్చిరెడ్డి స్పందించారు. శోభితను కన్నబిడ్డలా చూసుకున్నట్లు తెలిపారు. ‘పెళ్లి అయ్యేంత వరకూ ఆమె సెలబ్రెటీ అని మాకు తెలియదు. నా కుమారుడు సుధీర్ రెడ్డి, కోడలు శోభిత అన్యోన్యంగా ఉండేవారు. వారిద్దరి మధ్య ఎప్పుడూ ఎలాంటి గొడవలు లేవు. స్వల్ప కాలంలో మా ఇంట్లో సొంత కూతురులా మెలిగింది. సినిమాల్లో నటించకూడదని మేము ఎప్పుడు అభ్యంతరం వ్యక్తం చేయలేదుR...
తమిళ హీరో సూర్య నటించిన ‘కంగువా’ థియేట్రికల్ రన్ పూర్తయింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకుని ఆల్‌టైమ్ డిజాస్టర్‌గా నిలిచింది. రూ.130 కోట్ల మేర నష్టం వచ్చినట్లు సినీవర్గాలు తెలిపాయి. దీంతో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ సినిమా పేరిట ఇప్పటివరకు ఉన్న చెత్త రికార్డును కంగువా బ్రేక్ చేసింది. రాధేశ్యామ్ మూవీకి రూ....
హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రిలో నటి శోభిత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. డాక్టర్లు ఇచ్చిన పోస్టుమార్టం రిపోర్టులో శోభితది.. ఆత్మహత్యగా స్పష్టం చేశారు. ఆమె శరీరంపై ఎలాంటి అనుమానాస్పద ఆనవాళ్లు, గాయాలు లేవని నిర్ధారించారు. కాగా, నటి రూమ్‌లో దొరికిన సూసైడ్ నోట్‌లో ‘సూసైడ్ చేసుకోవాలంటే యూ కెన్ డూ ఇట్’ అని రాసి ఉంది. ఈ వ్యాఖ్యల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెల...
కన్నడ నటి శోభిత మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని పోలీసులు బంధువులకు అప్పగించారు. శోభిత బంధువులు బెంగళూరు నుంచి ఉస్మానియా మార్చురీకి భారీగా తరలొచ్చారు. అనంతరం మృతదేహాన్ని బంధువులు బెంగళూరుకు తరలించారు. కాగా, నిన్న హైదరాబాద్ గచ్చిబౌలిలో శోభిత ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
టాలీవుడ్‌కు ‘హ్యాపీడేస్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మిల్కీ బ్యూటీ తమన్నా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ‘స్త్రీ 2’ సక్సెస్‌కు కారణం ‘ఆజ్ కీ రాత్’ అనే పాట. ఈ సాంగ్‌లో నేను ప్రాణం పెట్టి నటించాను.. అందుకే ఈ సినిమా ఇంతలా హిట్ అయ్యింది’ అని మిల్కీ బ్యూటీ చెప్పింది. కాగా, 2018లో వచ్చిన ‘స్త్రీ’ సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిస...
కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర నటిస్తున్న యూఐ సినిమా ఈ నెల 20 విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ చిత్రబృదం ఎప్పటికప్పుడు అందిస్తోంది.దీంతో సినీ ప్రేమికుల్లో ఆసక్తి పెరుగుతోంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. కాగా యూఐ క్రిస్‌మస్ కానుకగా ఈ నెల 20న విడుదల కానుంది. టీజర్‌లో ‘మీ ధిక్కారం కన్నా నా అధికారానికి పవర్ ఎక్కువ’ అనే డైలాగ్ హైలై...
కన్నడ సీరియల్ నటి శోభిత ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. భార్యభర్తల మధ్య ఎలాంటి విభేదాలు లేవని ప్రాథమికంగా గుర్తించారు. ఈ మేరకు ఆమె ఇంటి చుట్టుపక్కల వాళ్ల స్టేట్ మెంట్లను రికార్డు చేశారు. కాగా, ఆమె ఇంట్లో సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ‘అంతా బాగానే ఉంది. చావాలనుకుంటే యూ కెన్ డూ ఇట్’ అని రాసి ఉంది.
హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ చిత్రం నుంచి మరో అప్‌డేట్ వచ్చేసింది. విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా ఈ చిత్రంలో కనిపించనున్నట్లు మోహన్‌బాబు తెలిపారు. వీరి పుట్టినరోజు సందర్భంగా ‘కన్నప్ప’లో వీరికి సంబంధించిన ఫొటోను పంచుకున్నారు. కన్నప్పతో తన మనవరాళ్లు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నందుకు ఆనందిస్తున్నానని తెలిపారు. నటనపై వాళ్లకు ఉన్న అభిరుచి చూ...
బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన జీవితంలోని సంఘటన గుర్తు చేసుకున్నారు. ఒకానొక సమయంలో తాను బ్రేకప్ బాధ ఎదుర్కొన్నానని పేర్కొన్నారు. ఆ బాధతో మూవీ షూటింగ్ సెట్‌లో కూర్చొని ఏడ్చేశానని.. పాత్ర కోసం సిద్ధమవుతున్నప్పటికీ కన్నీళ్లు ఆగలేదని తెలిపారు.